బంగారు తెలంగాణలో కొండాపూర్ అభివృద్ధి చూడండి...
- కాలువల ఆక్రమణతో వర్షపు నీరు ప్రధాన రహదారిపై నిలిచి గుంతలుగా మారి మండల ప్రజలు అవస్థలు పడుతున్న పట్టించుకోని పాలకులు.
- చెత్త తీసేందుకు పంచాయితీ ట్రాక్టర్ కు డిజిల్ కి డబ్బులు లేవు.
- నెల రోజులుగా రోడ్డు మీదనే చెత్తకుప్పలు.
![]() |
| ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి కొండాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి దృశ్యం. |
![]() |
| ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి కొండాపూర్ చౌరస్తాలోని ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉంది. |
![]() |
| కొండాపూర్ లో నెలరోజులుగా కాలువ నుండి తీసిన చెత్తను ఎత్తకపోవడంతో మల్లి కాల్వలోకి వెళుతున్న దృశ్యం. |
తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ గా మారిందని గత నెలలో ఇరవై ఒక్క రోజులపాటు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు ఆర్భాటంగా దశాబ్ది ఉత్సవాలు జరుపు కున్నారు. . బంగారు తెలంగాణలో కాసిపేట మండలంలోని కొండాపూర్ పంచాయితీ అభివృద్ధిని ఒక్కసారి పరిశీలిద్దాం..
ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్డుమీద నీరు నిలిచి వాగును తలపిస్తుంది. నీరు నిలవడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఎక్కడ గుంత ఉన్నదో తెలవకుండా ద్విచక్ర వాహనా దారులు లారీలు ఆటోలు అందులో తీవ్ర అవస్థలు పడి వెళుతున్నారు. రోడ్డు మీద పడ్డ వర్షపు నీరు రోడ్డు కింద కాలువల నుండి ప్రవహించాల్సి ఉండగా కాలువలను కబ్జా చేయడంతో నీరంతా రోడ్డుపై నిలుస్తుంది. రోడ్డు మీద నిలిచిన నీరుతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారు లంతా గత మూడు సంవత్స రాలుగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం ఇదే రహదారిపై గుంతల మధ్యలో వెళుతున్న ప్రజాప్రతినిధులు, మండల అధికారులు అధికార పార్టీల నాయకులు స్పందించక పోవడం సిగ్గుచేటు. ప్రజల సమస్యలను కష్టాలను పట్టించుకో ని ప్రజా ప్రతినిధులు, నాయకులంతా ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారంటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యం పల్లి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న గుంతల వల్ల తీవ్ర ఇబ్బందుల పాలవు తున్నాము మరమ్మత్తులు చేయించండి అని స్థానిక యువకులు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో మొరపెట్టు కున్నారు.
దీనికి స్పందించిన అధికార పార్టీ మండల అధ్యక్షుడు 'రోడ్డు మా పరిధిలో లేదు ఓరియంట్, సింగరేని యాజమాన్యం పరిధిలో ఉంది వారితో మాట్లాడి మరమ్మతులు త్వరలో చేపిస్తామని హామీ ఇచ్చాడు. మరి కొండాపూర్ చౌరస్తాలోని రోడ్డు ప్రభుత్వ పరిదిలోనే ఉంది కదా! ఎందుకు దీనిపై స్పందించడం లేదని కొండాపూర్ ప్రజలు ఆ నాయకున్ని ప్రశ్నిస్తున్నారు .
కొండాపూర్ గ్రామంలో కాలువల ఆక్రమణ పై ప్రధాన మీడియా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన గత మూడు సంవత్సరాలుగా వాట్సాప్ గ్రూప్ లో ఇటీవల 'scv news ' సోషల్ మీడియాలో వివరంగా వెల్లడించిన స్పందించకుండా 'దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా ' ప్రజా ప్రతినిధులు, అధికారులు, అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువల మీద ఆక్రమణలు తొలగించి రోడ్డు మీద పడ్డ వర్షపు నీరు గుంతలు కాకుండా మురికి కాలువల గుండా బయటకు పంపించ లేని చేతగాని ప్రజా ప్రతినిధులను, అధికారులను, నాయకులను చూస్తే జాలి వేస్తుందని గ్రామ ప్రజలు ఆక్రోషం వెళ్లగక్కు తున్నారు . ప్రజల అవస్థలు, వారి ఇబ్బందులు పట్టించుకోని సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులకు తమ విధులకు న్యాయం చేస్తున్నామా?అని ఆత్మ విమర్శ చేసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు .
* నెల రోజులుగా రోడ్డుపైనే చెత్త కుప్పలు.
గ్రామంలో గత నెల రోజులుగా కాలువలు నుండి తీసిన చెత్తను ఎత్తే వారు లేరు. చెత్త తీయకపోవడంతో మళ్లీ కాలువలోనే పడి దుర్గంధం వ్యాపిస్తుంది. చెత్త ఎందుకు తీయడం లేదని పంచాయితీ సిబ్బందిని అడిగితే ట్రాక్టర్ నడిచేందుకు డిజిల్ కు డబ్బులు లేవని సమాధానం ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బంగారు తెలంగాణలో గ్రామాల అభివృద్ధి ఎలా సాగుతుందో అర్థమవు తుంది. నాయకులకు ప్రజాప్రతినిదులకు ఓట్లు, అధికారులకు జీతాలు తీసుకోవడము తప్ప ప్రజల సమస్యలు పట్టవా?అని కొండాపూర్ గ్రామ ప్రజలు' సోషల్ మీడియా' ద్వారా ప్రశ్నిస్తున్నారు.
దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు,అధికారులు సమాధానం చెప్పాలి...


