శితిలావస్థలోని పాఠశాల భవనాలను కూల్చివేయాలి.
- ప్రజావాణిలో తుడుం దెబ్బ నాయకుల వినతి.

శిథిలావస్థలోని పాఠశాల భవనాలను కూల్చివేయాలని ప్రజావాణిలో వినతి పత్రం అందజేస్తున్న తుడుం దెబ్బ నాయకులు.
Scv News Kasipet:--
సాలెగూడెం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను కూల్చివేయాలని తుడుం దెబ్బ మండల నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సాలెగూడెం, బుగ్గ గూడెం గ్రామాలలోని ప్రాథమిక పాఠశాల భవనాలు శిధిలావస్థలో ఉండి స్లాబులు పెచ్చులు పడుతున్నాయని తెలిపారు. వర్షానికి తడిసి గోడలు కూడా కూలే పరిస్థితి ఉన్నాయని విద్యార్థులు వాటి కిందికి వెళ్లి ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా మండల అధికారులు స్పందించి వాటిని కూల్చివేయాలని కోరారు.
ప్రజావాణిలో వినతి పత్రం అందించిన వారిలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్, ఉపాధ్యక్షులు పెంద్రం శంకర్, ఆత్రం సంజీవ్, కోశాధికారి పంద్రం ప్రభాకర్ , సహాయ కార్యదర్శి ఆత్రం మహేష్, టేకం భీమ్రావు, ప్రచార కార్యదర్శి చిక్రం రాందాస్ లు పాల్గొన్నారు.