మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల గిరిజన సమస్యలపై ఐ టి డి ఏ పి ఓ కు వినతిపత్రం.

 కాసిపేట మండల గిరిజన సమస్యలపై ఐ టి డి ఏ పి ఓ కు  వినతిపత్రం.

 ఐటీడీఏ పీవోకు వినతి పత్రం అందిస్తున్న కాసిపేట తుడుం దెబ్బ నాయకులు.

Scv News Kasipet:-

 కాసిపేట మండలంలోని గిరిజన గ్రామాలకు చెందిన పలు సమస్యలపై తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేశామని తుడుం దెబ్బ నాయకులు తెలిపారు.

 మండల గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు తగిన ఉపాధ్యాయు ల నియమించాలని, ప్రతి ఆదివాసి గూడెంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని, ప్రతి గిరిజన గూడానికి  వీటీడీఏలు ఏర్పాటు చేయాలని, గట్రావు పల్లె సబ్ సెంటర్ లో ఏఎన్ఎం నియమించాలని డిమాండ్లతో ఐటీడీఏపీఓ కు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడల్ వెంకటేష్, ఉపాధ్యక్షులు పేంద్రం శంకర్, సిడం గణపతి, కోశాధి కారి  పెంద్రం ప్రభాకర్, మండల నాయకులు పంద్రం సంజీవ్, ఉయ్క మోతి రాములు ఉన్నారు.