గిరిజన యువత విద్యావంతులైతేనే గిరిజన గూడాల అభివృద్ధి.
- శ్రీమన్నారాయణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర నాయకులు.
![]() |
| గిరిజన హక్కుల అవగాహన సదస్సు హాజరైన నాయకులు ఆదివాసి యువత. |
![]() |
| సదస్సుకు హాజరైన అతిథులను సన్మానిస్తున్న తుడుం దెబ్బ నాయకులు. |
Scv News Kasipet:--
దేశానికి మూలవాసులైన గిరిజనులు అభివృద్ధి పథంలోకి రావాలంటే గిరిజన యువత విద్యావంతు లైనప్పుడే సాధ్యమవుతుందని, గిరిజన యువత చదువుపై శ్రద్ధ పెట్టాలని ప్రజాపంతు రాష్ట్ర నాయకుడు శ్రీమన్నారాయణ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసుల స్థితిగతులు ఉనికి హక్కులు, ఐక్యత పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన
శ్రీమన్నారాయణ మాట్లాడుతూ మారుమూల అటవీ ప్రాంతంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నివసించే గిరిజనులు అభివృద్ధి పథంలోకి రావాలంటే చదువు ఒక్కటే మార్గం అని అన్నారు. గిరిజన యువత విద్యపై దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలో చేరి విద్యానివసించాలన్నారు. అమాయక ఆదివాసులకు జరిగే అన్యాయాలను చదువుకొని విజ్ఞానవంతులైనప్పుడే ఎదిరించగలుగుతామన్నారు. ప్రభుత్వం ఆదివాసి ప్రాంతంలోని అడవులు కొండల్లో లభించే విలువైన ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు దోచి పెట్టేందుకు గిరిజనులపై దాడులకు పాల్పడుతుందన్నారు. చత్తీస్గడ్, అడవి ప్రాంతంలో పారా మిలిటరీ దళాలతో దాడులను నిర్వహిస్తుందన్నారు. అటవిని ఖనిజ సంపదను కాపాడుకోవాలంటే గిరిజనులు విద్యావంతులై చైతన్యవంతమైనప్పుడే సాధ్యమవుతుందని అన్నారు.
ఆదివాసి ఉపాధ్యాయ నాయకుడు శంకర్ మాట్లాడుతూ గిరిజన యువత చదువుపై శ్రద్ధ పెట్టాలని కోరారు. చదువుపై ఆసక్తి ఉండి పేదరికంలో ఉన్న ఆదివాసి యువకులకు తమ ఉపాధ్యాయ సంఘం ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. గిరిజన పేద విద్యార్థులు ఐఐటి నీట్ లో సీట్ సంపాదిస్తే తమ ఉపాధ్యాయ సంఘం తరఫున ఫీజు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసి యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువు పైన శ్రద్ధ పెట్టాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశంలో ఒకవైపు మణిపూర్ లో హింస కొనసాగుతున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం గిరిజనుల ఉనికికే ప్రమాదం కలిగించే అటవీ హక్కుల సవరణ పేరిట నూతన అటవీ చట్టం హడావిడిగా తెచ్చి ఈ నెల జూలై 26న ఆమోదింప చేసుకుందన్నారు. నూతన అటవీ చట్ట ప్రకారం ఆదివాసులకు అడవి పై హక్కు కోల్పోతున్నారని అటవీ సంపద ఖనిజ సంపదను కార్పొరేట్లు గ్రామ సభ ఆమోదం లేకుండానే తరలించుకొని పోవచ్చు అన్నారు. అటవీలోని జంతుజాలానికి ప్రమాదం తెచ్చే విధంగా ఏ కో టూరిజం పార్కులు, సఫారీ పార్కులు జూ పార్కులను ఏర్పాటు చేసుకునే హక్కును కార్పొరేట్ శక్తులకు ఇచ్చారన్నారు. గిరిజన యువత తమకు జరుగుతున్న అన్యాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నా రు.
ఆదివాసి ఉపాధ్యాయ నాయకుడు రోడ్డ గోపాల్ మాట్లాడుతూ గిరిజన యువత చదువుకుంటేనే మన కుటుంబాలు బాగుపడతాయని దీనికి తమ కుటుంబమే ప్రత్యక్ష సాక్షమన్నారు. అటవీలో మేకలు కాస్తూ బంక తెచ్చి జీవనం సాగించిన నన్ను మా తండ్రి పాఠశాలకు పంపడంతో విద్యావంతులై ఉపాధ్యాయునిగా చేరానన్నారు. తమ ఇద్దరి కూతుర్లను ఉన్నత చదువులు చదివించానని సమాజంలో హాయిగా బ్రతక గలుగు తున్నానన్నారు. ఆదివాసి యువత మాలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మీ కుటుంబాలను మార్చుకోవాలని అన్నారు. ప్రజాపంటు నాయకుడు సమ్మయ్య మాట్లాడుతూ గిరిజన యువకులు చదువుపై శ్రద్ధ పెట్టాలని కోరారు.
తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి అడే జంగు మాట్లాడుతూ గిరిజన యువతను చైతన్యవంతం చేయాలనే సదుద్దేశంతోనే అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని సమావేశానికి హాజరైన అతిథులకు ఆదివాసి యువతకు ధన్యవాదాలు చెబుతూ వందన సమర్పణ చేశారు.
సమావేశానికి తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తుడు దెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు, నాయక్ పోడ్ సేవా సంఘం మండలాధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


