మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.

 రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం.

 కొండాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్న ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.




Scv News Kasipet:--

 కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో ఈరోజు రైతులకు 3గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు నిరసనగా ఏం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో  పిసిసి అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ  సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి 24గంటల రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం సరికాదు, 3గంటల కరెంట్ అవసరం అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ కి రైతులపై ప్రేమలేదు,పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తె 3గంటల కరెంట్ ఇస్తారు, రైతులను ఇబ్బందుల పాలు చేస్తారని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేసేందుకు  కెసిఆర్ ప్రభుత్వం తెచ్చిన ధరణి ని తీసివేస్తారని , రైతు బంధు పథకం బందు చేస్తారన్నారు.  రైతులకు సకాలంలో మందులు,ఎరువులు రాకుండా మళ్ళీ వెనుకటి కాంగ్రెస్ పాలనను తీసుకవస్తారని ప్రజలు అప్రమత్తంగా  ఉండి కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని  హెచ్చరించారు. 

దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,జడ్పిటిసి పల్లె చెంద్రయ్య, ఎంపిపి రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపిపి పుస్కూరి విక్రంరావు,బి ఆర్ ఎస్ ప్రెసిడెంట్ బొల్లు రమణారెడ్డి,ఎంపీటీసిలు చెంద్రమౌళి, అక్కేపెల్లి లక్ష్మి, కొండబత్తుల రాంచేందర్,జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు సపాట్ శంకర్, సర్పంచ్చ్స్ మక్కల శ్రీనివాస్, ముత్యాల స్వప్న, దేవీ కొండయ్య, సర్పంచ్బి జంగు,బి అర్ ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, ఉప సర్పంచ్ లు. సుమన్ గౌడ్, శ్యామ్, సుమన్, బోయిని తిరుపతి, రైతు సమితి అధ్యక్షులు దుర్గం పోశం, కోఆప్టెడ్మా సిరాజ్ఖాన్జి,మాజి జడ్పటిసి రౌతు సతయ్య, మాజి సహకార సంఘం చైర్మన్ వంశీధర్ రావు, మార్కెట్క మిటీ డైరెక్టర్స్ మంజులా రెడ్డి, అప్పాల శేఖర్, బి ఆర్ ఎస్ నాయకులు అగ్గి సతయ్య, ప్రేమాకుమార్, లంక లక్ష్మణ్,వాసుదేవ్, మద్దెవేణి వేణు. వడ్లూరి మల్లేష్, అనంతరావు,సక్రియానాయక్, రాజన్న, కిషన్, రాజగౌడ్,పెంటు, తిరుపతి, ప్రభాకర్,శంకర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.