మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

5వ రోజుకు చేరుకున్న పంచాయతీ కార్మికుల సమ్మె.

 5వ రోజుకు చేరుకున్న పంచాయతీ కార్మికుల సమ్మె.

 కాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద న సమ్మెలో పాల్గొన్న పంచాయత్ సిబ్బంది.
Scv News Kasipet:--

 కాసిపేట మండలంలో  సమ్మె సోమవారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల  జేఏసీ ఆధ్వర్యంలో  సమ్మె రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలలో జరుగుతుంది. రేపటి నుండి అన్ని మండలాలలో నిరసన కార్యక్రమాలు చేయాల్సిందిగా జేఏసీ పిలుపునిచింది.

* జులై 11 న డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు వినతి పత్రాలు అందజేయాలి.

* జూలై 12 న అర్ధ నగ్న ప్రదర్శనలు నిర్వహించాలి.

* జులై 13న కండ్లకు గంతలు కట్టుకొని ర్యాలీలు నిర్వహించాలి.

* జులై 14న స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయాలి.

* జులై 15న MLA ల కార్యాలయాల వద్ద ధర్నాలు,వినతి పత్రాలు అందజేయాలి.

* జులై 16న ఆయా కేంద్రాలలో బిక్షాటన జర్పాలి.

* జులై 17న రాస్తారోకోలు నిర్వహించాలి.

* జులై 18న కుటుంబ సభ్యులతో కలసి సమ్మె 

* జులై 19న అన్ని సమ్మె టెంట్లలో అన్ని పార్టీల,ప్రజా సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలి.

* జులై 20 న మండల కేంద్రములలో వంట వార్పు నిర్వహించాలని 

 చాగంటి వెంకటయ్య

రాష్ట్ర జేఏసీ కన్వీనర్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు.