మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. - కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.

 పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు.

- కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.

 పంచాయతీ కార్మికుల దీక్ష సందర్భంగా వారికి మద్దతుగా మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.



Scv News Kasipet:--

నిత్యం గ్రామాల్లో సేవలందిస్తున్న కార్మికులు, తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడం ప్రభుత్వాన్ని సిగ్గుచేటని నిత్యం సేవలో ఉంటున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను కూడా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు.  కాసిపేట  మండల కార్యాలయంలో ఆవరణలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు పార్టీ తరఫున సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. అనంతరం కార్మికులకు ఆర్థిక సాయం అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.వారం రోజులగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే కార్మిక సమస్యలు పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనుకుల రాకేష్, నాయకులు మైదం రమేష్, జాడి శివ తదితరులు పాల్గొన్నారు.