కాసిపేట మండలం పంచాయితీ కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్షలో కూర్చున్న సిపిఐ నాయకులు. |
Scv News Kasipet:--
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. కాసిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు మండల పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఈరోజు cpi బెల్లంపల్లి అసెంబ్లీ నియజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేకర్ మరియు దగం మల్లేష్, పులి శంకర్, దుర్గం బాపు, పోతు రవి, దుర్గం పోషం , పోషo, జడి పోచయ్య,CPI పార్టీ తదితర నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రేగుంట చంద్రశేఖర్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు కరోనా సమయంలో ఎంతో అంకితభావంతో ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులంతా దళిత వర్గాలకు చెందిన వారు కాబట్టి అగ్రవర్గాలకు చెందిన నాయకులు వారి సమ్మెను పరిష్కరించడం లేదని విమర్శించారు. తక్షణం వారి సమస్యలు పరిష్కరించకుంటే వారి సమ్మెకు సిపిఐ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
