పంచాయతీ కార్మికుల సమ్మెకు MRPS జిల్లా కన్వీనర్ కలవల శరత్ మద్దతు .

కాసిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు 16వ రోజుకు చేరుకున్న పంచాయతీ కార్మికుల రిలే దీక్షలు.
Scv News Kasipet:--
రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది.కాసిపేట మండల పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికుల నిరాహార దీక్షకు మాదిగ దండోరా జిల్లా కన్వీనర్ కలవల శరత్ మద్దతు తెలిపా రు.
ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులుగా దళితులు మాత్రమే పనిచేస్తారని వీరికి కనీస వేతనాలు కూడా చెల్లించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు సమ్మెను కొనసాగిస్తూ నే రామ సర్పంచ్ల ఇండ్ల ముందు కూడా ధర్నా చేయాలని పంచాయతీ కార్మికులకు పిలుపునిచ్చారు.