12వ రోజుకు చేరిన పంచాయతీ కార్మికుల సమ్మె .- ఒంటి కాలుపై నిలబడి నిరసన.

కాసిపేట ఎంపీడీవో కార్యాలయం ముందు రిలే దీక్షలో ఒంటి కాలిపై దీక్ష చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న పంచాయతీ కార్మికులు.
Scv News Kasipet:-
రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమ్మె నేటికీ 12వ రోజుకు చేరుకుంది. వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు చేసే కార్మికులు సమ్మెలో పాల్గొనడం వల్ల గ్రామాల్లో మురుగు కాలువలు చెత్త కుప్పలు ఎక్కడికక్కడ పేరుకు పోతు దుర్గంధం వ్యాపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉన్నదృష్ట పంచాయితీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు కాసిపేట మండలం పంచాయతీ కార్మికులు మండల పరిషత్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఒంటికాలితో నిరసన వ్యక్తం చేశారు.