మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట - 2గని పై 'నా భద్రత నా బాధ్యత.. నా భద్రతే నా కుటుంబ భద్రత ' కార్యక్రమం.

 కాసిపేట - 2గని పై  'నా భద్రత నా బాధ్యత.. నా భద్రతే నా కుటుంబ భద్రత ' కార్యక్రమం.



 రక్షణ ప్రతిజ్ఞ చేస్తున్న కాసిపేట 2 గని అధికారులు, కార్మికులు.




Scv News Kasipet:--

 సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలు తగ్గించుట సురక్షిత పని విధానాలపై కార్మికులకు అవగాహనకు కార్పొరేట్ రక్షణ విభాగం ఆదేశాల మేరకు  ఈనెల ఒకటవ తేదీ నుండి రక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మందమర్రి ఏరియా కాసిపేట టు గని పై 'నా భద్రత నా బాధ్యత... నా భద్రతే నా కుటుంబ భద్రత ' కార్యక్రమం జరిగింది.కార్మికుల నిర్దేశించి ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ మాట్లాడుతూ  కార్మికులు పని స్థలాల్లో నిరంతరంగా అప్రమత్తతో ఉండి పని చేయాలన్నారు. తాము చేస్తున్న పనుల పై పనిముట్లపై అవగాహన కలిగి రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలన్నారు.ఈ కార్యక్రమం లో కార్మికులను ఉద్దేశించి గని మేనేజర్ లక్ష్మీనారాయణ, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శ్రీనివాస్,తిరుపతి పలు రక్షణ సూచనలను చేశారు. కార్యక్రమంలో రక్షణాధికారి సంతోష్ రావు సంక్షేమ అధికారి భార్గవ, ఇంజనీర్  రఘు, సర్వేయర్ ప్రకాష్  మైనింగ్ సూపర్వైజర్లు కార్మికులు  పాల్గొన్నారు.