మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మందమర్రి జీఏం దృష్టికి తీసుకెళ్లిన పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ.

 స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

 మందమర్రి జీఏం దృష్టికి తీసుకెళ్లిన పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ.

 మందమర్రి జిఎం మోహన్ రెడ్డిని కలిసి శాలువాతో సన్మానిస్తున్న పెద్దన పల్లి సర్పంచి వేముల కృష్ణ.

Scv News Kasipet:--

మందమర్రి ఏరియాలోని కేకే2 ఉపరితల గనీలో భూములు కోల్పోయిన వారితో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపరిత గనిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దనపల్లి పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ ఈరోజు నూతన జిఎం మోహన్ రెడ్డి కలిసి విన్నవించారు. మందమర్రి ఏరియా నూతన జిఎంగా  బాధ్యత స్వీకరించే మోహన్ రెడ్డిని సర్పంచి  మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఉపరితల గని వలన ఏర్పడే పలు సమస్యలను జీఏం దృష్టికి తీసుకెళ్లారు.  స్థానిక నిరుద్యోగులకు ఆర్ వి ఆర్ కాంట్రాక్టు సంస్థ ఉద్యోగాలు కల్పించడం లేదని అన్నారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్న  డ్రైవర్ల సమస్యలపై సైతం పట్టించుకోవడంలేదని,వెంటనే డ్రైవర్ల సమస్య పరిష్కరిం చేందుకు కృషి చేయాలని విన్నవించానని ఒక ప్రకటనలో తెలిపారు.