మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గని పైన రక్షణ అవగాహన సమావేశము.

 కాసిపేట గని పైన రక్షణ అవగాహన సమావేశము.

ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం

-సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్,సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై అవగాహన.రక్షణకు అధిక ప్రాధాన్యత,

-ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.

 కాసిపేట గని పై సేఫ్టీ జిఎం గురువయ్యను  సన్మానిస్తున్న ట్రేడ్ యూనియన్ నాయకులు.



 కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సేఫ్టీ జిఎం గురవయ్య.


Scv News Kasipet:-

కాసిపేట గని పై రక్షణ అవగాహన సమావేశాలను సింగరేణి యాజమాన్య ఆదేశాల మేరకు సోమవారం నాడు  నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సేఫ్టీ జి ఎం గురువయ్య కార్మికుల నుద్దేశించి  మాట్లాడుతూ ప్రమాదాలు అసలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి,వాటిని ఎలా నివారించాలి,తీయసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వివరాలు తెలియ చేశాడు., 'నా రక్షణ నాదే బాధ్యత నుండి నా రక్షణ నా కుటుంబ బాధ్యతగా మనకు మనమే సతహగా రక్షణ పొందాలని కోరారు.  రక్షణ అవగాహన సమావేశంలో కుటుంబ యజమాని ఆరోగ్యం గా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉంటుందని,అప్పుడే సంస్థ బాగుంటుందని అలాగే సమావేశాలు జులై మాసం మొత్తం ఉంటాయని అన్నారు.రక్షణ ప్రతి క్షణం ,ప్రతి నిమిషం ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యముగా ఉంటే సమస్త బాగుంటుందని,అవగాహన తో ప్రమాదాలను నివారించ వచ్చునని, పని పైన దాసతో చేయాలని,అప్రమత్తతో ఉండాలని అన్నారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్,(SMP),సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ  కార్మికులు పని పైన అవగాహన కలిగి ఉండడంతో ప్రమాదాలను నివారించు కోవచ్చని,పని చేసే విధానాలు తెలుసుకోవాలని   అన్నారు.  రీజినల్ రక్షణ అధికారి గుప్తా మాట్లాడుతూ సేఫ్టీ పై అవగాహన కలిగి శిక్షణ పొంది ఉండేందుకు సింగరేణి యాజమాన్యం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తుందనిన్నారు.

ఉత్పత్తి తో పాటు రక్షణ నియమాలను పాటించి బొగ్గు ఉత్పత్తి తీసుకురావాలని ఉద్యోగులను కోరారు.ఎజెంట్ రామ దాసు  మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్లు సవరించుకొని ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అన్నారు. గని జీరో ప్రమాదరహిత గని గా మార్చగల బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. కార్యక్రమంలో TBGKS వైస్ ప్రెసిడెంట్ మెడిపెల్లి సంపత్, AITUC బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్ మాట్లాడారు.  గని మేనేజర్ అల్లావుద్దీన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏరియా రక్షణాధికారి రవీందర్,ఏరియా ఇంజనీర్ నాగరాజు,రక్షణ అధికారి సునీల్ కుమార్,TBGKS,AITUC ఏరియా నాయకులు బడికెల సంపత్,O. రాజా శేఖర్, శంకర్ రావు,పిట్ సెక్రెటరీ బైరి శంకర్,మీనుగు లక్ష్మినారాయణ,ఇంజనీర్లు బాబు,మధుకర్,డిప్యూటీ మేనేజర్లు నిఖిల్,వెంకటేష్, దిలీప్, సుమన్,సర్వేయర్ వేకటేశ్వర్లు,ఖాన్, బన్న లక్ష్మన్ దాస్,వర్క్ మెన్ ఇన్సఫెక్టర్స్ ఒడ్నాల రాజన్న, బాను,శ్రీనివాస్, రక్షణ కమిటీ సభ్యులు బండారు రమేష్,రవి,తోకల రమేష్  తదితరులు పాల్గొన్నారు.


సేఫ్టీ జి. ఎం కు సన్మానం


కాసిపేట గని కి విచ్చేసిన  సేఫ్టీ జనరల్ మేనేజర్ కార్పొరేట్ గురువయ్య  గారిని  TBGKS మెడిపెల్లి సంపత్, బడికెల సంపత్,O. రాజా శేఖర్,ఒడ్నాల రాజన్న,బైరి శంకర్, ఏఐటీయూసీ దాగం మల్లేష్,లక్ష్మీ నారాయణ, రాజేందర్ నాయకులు, అధికారులు శాలువాతో సన్మానించారు.