కాసిపేట గని పైన రక్షణ అవగాహన సమావేశము.
-ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం
-సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్,సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై అవగాహన.
-రక్షణకు అధిక ప్రాధాన్యత,
-ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.
![]() |
| సేఫ్టీ జిఎం ను సన్మానిస్తున్న కాసిపేట గని అధికారులు. |
![]() |
| కాసిపేట గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సేఫ్టీ జిఎం గుప్తా. |
Scv News Kasipet:--
కాసిపేట గని పై రక్షణ అవగాహన సమావేశాలను సింగరేణి యాజమాన్య ఆదేశాల మేరకు సోమవారం నాడు నిర్వహించడం జరిగింది.ప్రమాదాలు అసలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి,వాటిని ఎలా నివారించాలి,తీయసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వివరాలు తెలియ చేస్తు, నా రక్షణ నాదే బాధ్యత నుండి నా రక్షణ నా కుటుంబ బాధ్యతగా మనకు మనమే సతహగా రక్షణ పొందాలని జనరల్ మేనేజర్ (సేఫ్టీ) బెల్లంపల్లి రీజనల్ అన్నారు.రక్షణ అవగాహన సమావేశంలో కుటుంబ యజమాని ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉంటుందని,అప్పుడే సంస్థ బాగుంటుందని అలాగే సమావేశాలు జులై మాసం మొత్తం ఉంటాయని అన్నారు.రక్షణ ప్రతి క్షణం ,ప్రతి నిమిషం ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యముగా ఉంటే సమస్త బాగుంటుందని,అవగాహన తో ప్రమాదాలను నివారించ వచ్చునని,పని పైన దాసతో చేయాలని,అప్రమత్తతో ఉండాలని అన్నారు. సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్,(SMP),సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి.పని పైన అవగాహన కలిగి ఉండడంతో ప్రమాదాలను నివారించు కోవచ్చని,పని చేసే విధానాలు తెలుసుకోవాలని అన్నారు. సేఫ్టీ పై అవగాహన కలిగి శిక్షణ పొంది ఉండేందుకు సింగరేణి యాజమాన్యం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తుందని సింటాస్ అధికారి శర్మ అన్నారు.
ఉత్పత్తి తో పాటు రక్షణ నియమాలను పాటించి బొగ్గు ఉత్పత్తి తీసుకురావాలని ఉద్యోగులను కోరారు.మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్లు సవరించుకొని ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అన్నారు. గని జీరో ప్రమాదరహిత గని గా మార్చగల బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో రక్షణ అధికారి సునీల్ కుమార్, TBGKS,AITUC పిట్ సెక్రెటరీ బైరి శంకర్,మీనుగు లక్ష్మినారాయణ, ఇంజనీర్లు బాబు,మధుకర్, డిప్యూటీ మేనేజర్లు నిఖిల్,వెంకటేష్, దిలీప్, సర్వేయర్ వేకటేశ్వర్లు,ఖాన్,WO మీర్జా, బన్న లక్ష్మన్ దాస్,వర్క్ మెన్ ఇన్సఫెక్టర్స్ ఒడ్నాల రాజన్న, బాను,శ్రీనివాస్, రక్షణ కమిటీ సభ్యులు బండారు రమేష్,రవి,తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సేఫ్టీ జి. ఎం కు సన్మానం
నూతనంగా సేఫ్టీ జనరల్ మేనేజర్ బెల్లంపల్లి రీజినల్ గా బాధ్యతలు స్వీకరించిన గుప్త గారిని అధికారులు అల్లావుద్దీన్, శర్మ, సునీల్,నిఖిల్, బాబు,మధుకర్,దిలీప్,వెంకటేష్ శాలువాతో సన్మానించారు, అనంతరం TBGKS ఒడ్నాల రాజన్న,బైరి శంకర్, ఏఐటీయూసీ లక్ష్మీ నారాయణ, రాజేందర్ నాయకులు శాలువాతో సన్మానించారు.

