మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా కనుకుల రాకేష్ నియామకం.

 కాసిపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా కనుకుల రాకేష్ నియామకం.


Scv News Kasipet:--

కాసిపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోమగూడెంకు చెందిన కనుకుల రాకేష్ ను నియామకం చేస్తూ ఈరోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు తాళ్ల సంపత్ రెడ్డి   కనుకుల రాకేష్ కి అందచేశారు.

ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో  ఇంత పెద్ద భాధ్యతను నాకు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొక్కిరాల సురేఖమ్మ గారికి ఏఐసిసి మెంబెర్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మరియు దీనికి సహకరించిన బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమడుగుల మహేందర్ గారికి,కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ మండల కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం యూత్ కాంగ్రెస్  కోసం మరింత కష్టపడి పని చేస్తానని అన్నారు.