మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ముత్యం పల్లి పంచాయతీ దుబ్బగూడం గ్రామానికి కోటి 5 లక్షలతో బిటి రహదారి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ.

 దుబ్బగూడం గ్రామానికి 1.05 కోట్ల నిధుల బీటీ రహదారికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భూమి పూజ.

 దుబ్బగూడం  గ్రామానికి కోటి రూపాయల నిధులతో చేపట్టే రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


Scv News Kasipet :--

 కాసిపేట మండలం ముత్యం పల్లి పంచాయతీ పరిధిలోని దుబ్బగూడం గోండు గూడానికి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మే రకు ఐటీడీఏ నుండి కోటి ఆరు లక్షల నిధులతో బి టి రహదారిని మంజూరు చేయించారు. ఈ నిధులతో ప్రారంభమయ్యే బీటీ రోడ్డు పనులకు ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎంపీపీ రోడ్డు లక్ష్మీ గ్రామ సర్పంచి ఆడే బాదు భూమి పూజ చేశారు..

 ముత్యంపల్లి గ్రామ పంచాయతీ లోని దుబ్బగూడెం విలేజ్ నుండి అర్ &బి రోడ్ వరకు ఐటిడిఏ ద్వారా 1.05 కోట్ల నిధులతో బీటీ రోడ్డును వేస్తారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు,BRS కాసిపేట మండల అధ్యక్షులు రమణ రెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం,మాజీ జెడ్పీటీసీ రౌత్ సత్తయ్య,ఉప సర్పంచ్ బొయిని తిరుపతి,బి.అర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు మదినేని వేణు, బి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు సుధాకర్ రెడ్డి,లంక లక్ష్మణ్,బుగ్గ రాజు, నాయకులు జంగు, బీమ్ రావు,రత్నం రాజన్న పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.