మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తాగునీటి కోసం ఆందోళన చేస్తున్న చిన్న ధర్మారం గ్రామస్తులకు బిజెపి మద్దతు.

 తాగునీటి కోసం ఆందోళన చేస్తున్న చిన్న ధర్మారం గ్రామస్తులకు బిజెపి మద్దతు.

 చిన్న ధర్మారం గ్రామస్తుల తాగునీటి సమస్య పరిష్కరించాలని మండల పరిషత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేస్తున్న బిజెపి నాయకులు.



Scv News Kasipet:--

 కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామంలో చాలా రోజులుగా తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఈరోజు  గ్రామ మహిళలు  ఎంపీడీవో కార్యాలయాన్ని బిందెలతో ముట్టడించారు.  వీరికి మద్దతుగా బిజెపి నాయకులు ప్రజల సమస్య త్వరగా తీర్చాలని లేనిచో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అధికారులను హెచ్చరించారు. నీటి సమస్య వెంటనే పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేసారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్  బెల్లంపల్లి నియోజవర్గ కన్వీనర్ రాచర్ల సంతోష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట కృష్ణ,  బెల్లంపల్లి పట్టణ నాయకులు కోడి రమేష్  బిజెపి నాయకులు యూసఫ్, శంకర్ రెడ్డి బాలరాజు, సన్నీ, లోకేష్ ,సాయి వివేక్,శ్రీ పాల్ ,సాయి, విజయ్  మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.