కాసిపేట మండలంలో బిజెపి బూత్ సభ్యుల సమ్మేళనం.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ విస్తరణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామా లలో 29 /06/23 నుండి ప్రతి గ్రామంలో బూత్ పరిశీలన మరియు ఇంటింటికి కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. 4 జూలై 2023 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింధి.
మేరా బూత్ సబ్సే మజ్బూత్ ఈరోజు ముగింపు సందర్భంగా కాసిపేట మండలంలోని 23 వ బూత్ సభ్యుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది దీనిలో మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, అల్పకాలిక్ విస్తారక్ ముత్యాల శివ కుమార్ బెల్లంపల్లి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ బుక్యా అరవింద్ బూత్ అధ్యక్షులు పొలవెని శ్రీకాంత్ ముత్యంపల్లి బూత్ అధ్యక్షులు రమేష్ గారు మరియు కార్యకర్తలు పాల్గొని ఈ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.తదనంతరం కసిపేట మండలానికి స్వల్పకాలిక విస్తారక్ గా వచ్చిన ముత్యాల శివ కుమార్ గారిని సన్మానించి వీడ్కోలు తెలపడం జరిగింది.
