మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బన్న ఆశాలు ను పరామర్శించిన TJS అధ్యక్షులు కోదండరాం.

 తెలంగాణ ఉద్యమకారుడు  బన్న ఆశాలు ను పరామర్శించిన TJS అధ్యక్షులు కోదండరాం.

 తెలంగాణ ఉద్యమకారుడు బన్న ఆశాలను పరామర్శిస్తున్న
 కోదండరాం. 


Scv News Kasipet:--

మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,కాసిపేట మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బన్న ఆశాలు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకుని కాసిపేట గ్రామానికి వచ్చిన TJS రాష్ట్ర అధ్యక్షులు ప్రొపెసర్ కోదండరాం పరామర్శించారు. సర్పంచ్ గా పని చేసిన రోజుల్లో గామ,మండల అభివృద్ధి కోసం, విద్య,వైద్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం చేసిన కృషి ని, తెలంగాణ మాలి దశ ఉద్యమంలో వయస్సు తో నిమిత్తం లేకుండా ఉద్యమం లో భాగస్వామ్యం చాలా గొప్పదని అన్నారు. 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఉన్న ఆశాలు గారు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కోదండరాం అన్నారు.కోదండరామ్ గారితో బాబన్న,గోనెల శ్రీనివాస్,శిలోజ్ మురళి,మద్దవేని చిన్న భీమయ్య, సిద్ధం బాపు,సిద్ధం రాములు, మల్లేష్, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.