ఆదివాసులకు ఉచిత బోధన అందించాలని వినతి.
![]() |
| టి ఏవి పాఠశాల ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందజేస్తున్న తుడుం దెబ్బ నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ యాజమాన్య పరిధిలో నడిచే డి ఏవి పాఠశాలలో ఆదివాసులకు ఉచిత బోధన అందించాలని తుడుం దెబ్బ నాయకులు డి ఏ వి పాఠశాల ప్రిన్సిపాల్ కు వినతి పత్రం అందజేశారు. పాఠశాలలో గిరిజన విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాలని అడ్మిషన్ ఫీజు 10,000 తీసుకోకుండా ఉచితంగా బోధించాలని గిరిజన నాయకులు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో తుడుం దెబ్బ మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడమ కిషన్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కనకరాజు, నాయక్ పోడ్ సేవా సంఘం సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు , రెడ్డి లక్ష్మణ్, ఆడ శేకర్, వేడ్మ కృష్ణ, మంగ ఎల్లయ్య తదితరులు ఉన్నారు.
