మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామ విద్యార్థినిలను సన్మానించిన సర్పంచ్ వేముల కృష్ణ.

 ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామ విద్యార్థినిలను సన్మానించిన సర్పంచ్ వేముల కృష్ణ.

  ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సన్మానించిన పెద్దనపల్లి సర్పంచి వేముల కృష్ణ.



Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని పెద్దన పెళ్లి గ్రామ పంచాయితీ లో ని విద్యార్థినిలు చదువులో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు వారిని అభినందిస్తూ  గ్రామ సర్పంచి వేముల కృష్ణ సన్మానించారు.గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన జీదుల లక్ష్మన్ -రాధీక ల కుమార్తె సిరి  మొన్నటి నీట్ పరీక్ష లో ఉత్తిర్ణీత సాధించి అర్హత పొందింది. అలాగే కొండ ప్రవీణ్ - సుధ ల కుమార్తె శ్రీ వల్లి పదవ తరగతిలో గ్రామంలో అందరి విద్యార్థుల కంటే 9.0 చదివి ఉత్తమ ఫలితాలను సాధించిన గ్రామ ముద్దు బిడ్డలకు సర్పంచ్ వేముల కృష్ణ ఘనంగా సన్మానించి , స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ  మాట్లాడుతూ ఒకరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మరియు ఒకరు ప్రభుత్వ పాఠశాల లో చదివి ఇంత మంచి ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థినిలు గ్రామనికే గర్వకారణమని కొనియాడారు.  భవిష్యత్తులో మరింత ఉత్సాహాంతో ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తల్లి తండ్రుల పేరు, అలాగే గ్రామం పేరు  దేశారాష్ట స్థాయిలో తీసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కొత్త రమేష్, బొల్లెపల్లి కొమురక్క ,బన్న హిందుమతి,కో ఆప్షన్ జీదుల కనకయ్య, పిల్లల  తల్లి తండ్రులు జీదుల లక్ష్మన్ -రాధీక, కొండ ప్రవీణ్ -సుధ దంపతులు గ్రామస్తులు నందికొండ శ్రీధర్ లు పాల్గొన్నారు.