మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాసిపేట మండల వాసుల అలుపెరుగని పోరాటం.

 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా scv News ప్రత్యేక కథనం....

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండాపూర్ చౌరస్తాలో నిరాహార దీక్ష లో పాల్గొన్న మహిళలు.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్షలో కూర్చున్న బన్న ఆశాలుకు మద్దతుగా కూర్చున్న అప్పటి దివంగత నేతలు ఎమ్మెల్యే గుండ మల్లేష్ ఎంపీపీ రఘుపతిరావు లు


 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న జేఏసీ నాయకులకు మద్దతుగా నడుస్తున్న అప్పటి దివంగత నేత ఎంపీపీ రఘుపతిరావు 


 ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న దివంగత నేత దాసరి శ్రీనివాస్ ( కొండాపూర్ చౌరస్తాలో )

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మండల ప్రజలు.

Scv News Kasipet:--

 ఆంధ్ర వలసవాదుల పాలనలో ఎన్నో దోపిడి, వివక్షలకు గురైన తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతం నాయకులే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా  ఉంటూ తెలంగాణ ప్రాంతంలోని సహజ వనరులను, నీరు, ఉద్యోగాలను దశాబ్దాలుగా దోపిడీ చేశారు. వీరి దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజలు నిధులు నియామకాలు, ఉద్యోగాల పేరిట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. ఈ ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ప్రతిరోజు రాస్తారోకో వంటావార్పు నిరాహార దీక్షల తో ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తల వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికీ పదేళ్లు గడుస్తుంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాసిపేట మండల వాసుల పాత్ర గురించి తెలుసుకుందాం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కాసిపేట మండలంలో 2001లో ప్రారంభమైంది. మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయి తెలంగాణ రాష్ట్రం కోసం గ్రామాలలో ఉద్యమాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట సమితి ని మొదట కోమటిచెను చెందిన దివంగత దళిత నేతలు కంది రాజమల్లు, దేవాపూర్ కు చెందిన వడ్లూరి నర్సయ్య, దాసరి శ్రీనివాసుల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కాసిపేట మండలంలో ప్రారంభమైంది. మండలంలోని అగ్రకుల నాయకులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీలలో ఉండి తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండి ఆంధ్ర పాలకులకు వత్తాసు పలుకుతూ ఉద్యమాన్ని అణచి వేసేందుకు ఎన్నో కుట్రలు చేశారు. వారి కుట్రలన్నింటిని చేదించి దళిత నేతలు మండలంలోని అన్ని గ్రామాలకు తెలంగాణ ఉద్యమాన్ని విస్తరింప చేశారు.

2009 నుండి ఉద్యమం ఉదృతం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం 2009 నుండి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రూపం దాల్చింది. మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరింప చేశారు. మండల జేఏసీ కన్వీనర్ గా శిలోజు మురళి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మండలంలోని అన్ని గ్రామాలకు విస్తరింప చేసేందుకు పాదయాత్ర ప్రారంభించారు. సోమ గూడెం నుండి లక్ష్మీపూర్, సోనాపూర్ దేవాపూర్ మీదుగా కాసిపేట మండల కేంద్రానికి మూడు రోజులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవశ్యకత గురించి ప్రజలను చైతన్యం చేస్తూ నూట ఇరవై నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రధాన రహదారుల మీద రాస్తారోకోలు, వంటా వార్పులు, సహపంక్తి భోజనాలు కుల సంఘాలతో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకు వెళ్లారు. మండలంలో కాసిపేట, కొండాపూర్ చౌరస్తా, దేవాపూర్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏ సిల ఆధ్వర్యంలో రిలే నిరహర దీక్షలు ప్రారంభ మయ్యాయి. ప్రతిరోజు దీక్షా శిబిరాలలో వివిధ కుల సంఘాల నాయకులు కూర్చుండి వంటావార్పులు సహపంక్తి భోజనాల్లో పాల్గొనేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొట్టమొదట ధర్మరావుపేట చెందిన బత్తుల మధు మండల కేంద్రంలో అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మూడు రోజుల్లోనే బత్తుల మధు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వెంటనే మండల జేఏసీ కో కన్వీనర్ బన్న ఆశలు అంబేద్కర్ విగ్రహం వద్ద 10 జనవరి 2013న అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. కొండాపూర్ చౌరస్తాలో కోమటి చేనుకు చెందిన దుర్గం పోశం అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బన్న ఆశలు ఏడు రోజుల అమరణ దీక్షతో నిరసించి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. మండలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో దివంగత నేతలు దేవాపూర్ కు చెందిన దాసరి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రఘుపతిరావు ల పాత్ర క్రియాశీలం. తెలంగాణ ప్రజల పోరాట ఉధృతికి భయపడి కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది.

ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లేదు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఉద్యమించిన బహుజన నాయకులకు మండలం లో గుర్తింపు లేదు.ఆంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహరించిన అగ్రకులాలకు చెందిన నాయకులే టిఆర్ఎస్ లో చేరి నాయకత్వ స్థానాల్లో ఉండడం వల్ల బహుజన వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా వారి పెత్తనమే చెలాయించడం వల్ల రాజకీయాలలో పదవులు పొందే అవకాశాలు ఉన్నా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయమే జరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ ఉద్యమకారుడు దాసరి శ్రీనివాస్ ఉదాంతం. 

మండలంలో మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోలీసుల లాంటి దెబ్బలు ఎన్నో కేసులను ఎదుర్కొని ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లిన దేవాపూర్ కు చెందిన దివంగత నేత దాసరి శ్రీనివాస్ కు మండల ఎంపీపీగా అవకాశం వచ్చిన తమ మాట వినడనే నెపంతో అగ్రవర్ణాల నాయకులు కుట్రలు చేసి పదవి రాకుండా చేశారు. తెలంగాణ ఉద్యమకారుడికి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదని మనోవేదనకు గురై కొద్దిరోజుల్లోనే గుండెపోటుతో మరణించారు.

 తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన విస్తరించిన నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవిం చిన గత దశాబ్ద కాలంలో ఆసరా రైతుబంధు,కళ్యాణ లక్ష్మి లాంటి వ్యక్తిగత పథకాలు తప్ప, తెలంగాణ పల్లెలో జరిగిన అభివృద్ధి శూన్యమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూములు, దళితులకు మూడెకరాల భూమి హామీలు కను మురుగయ్య యి. ఊరురా బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారి మధ్యతరగతి కుటుంబాలు యువత మద్యం మత్తులో చిత్తవుతున్నా పట్టించుకునే వారు లేరు. ధరణి పేరిట గ్రామాల్లోని భూస్వాములు నిరుపేదల భూములను గుంజుకుంటున్నారు. విద్యా వైద్యం, నిధుల కేటాయింపు లేక పేద వర్గాలకు అందని ద్రాక్షగాని మిగిలింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుందని ఆశపడ్డ బహుజన వర్గాలకు తీవ్ర నిరాశా నిస్పృహని మిగిల్చింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా,ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా లే లదే యిష్టారాజ్యం. అధికార పార్టీ ముసుగులో నాయకులుు చేసే అరాచకాలకు అంతులేకుండా పోయింది. వీరికి వ్యతిరేకంగా ప్రజలుు మాట్లాడితే పోలీసు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ని  పల్లెల్లో గ్రామాలలో కనీసం తమ న్యాయమైైైన హక్కుల గురించి  స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా  ప్రజలు భయం భయంగా బ్రతకాల్సిన దుస్థితికి రావడం తీవ్రవిషాదకరం.