మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మరో పేదింటి పెండ్లికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న పల్లగూడెం సర్పంచ్ దుస్స విజయ - చందులు.

  మరో పేదింటి పెండ్లికి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న పల్లగూడెం సర్పంచ్ దుస్స విజయ - చందులు.

 గుండు గూడెం గ్రామానికి చెందిన ఆత్రం జంగు కుమార్తె భీమేశ్వరి  వివాహానికి ఆర్థిక సహాయం చేస్తున్న పళ్ళగూడెం సర్పంచి దుస్స విజయ.

Scv News Kasipet:--

మంచిర్యాల జిల్లాలో వివిధ మండలాలలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడా లేని విధంగా నిరుపేద కుటుంబాలలో జరిగే పెండ్లిలలో ఆడపిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తూ కాసిపేట మండలంలోని పల్లం గూడ పంచాయతీ సర్పంచ్ విజయ- చందులు జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వివాహ సమయాల్లో ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ఈరోజు పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందులు. పంచాయితీలోని గోండుగూడెం గ్రామానికి చెందిన ఆత్రం భారతి -జంగు గార్ల కూతురు భీమేశ్వరి వివాహా నికి పదివేల నగదు తో పాటు పుస్తె మట్టెలు కొత్త బట్టలు అంద జేశి పేద గిరిజన కుటుంబం ఇంట్లో వెలుగులు నింపారు. పంచాయితీ లో గత రెండు నెలలలో ఆర్థిక సహాయం చేసింది నాలుగవ కుటుంబం.పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ చందులను స్ఫూర్తిగా తీసుకొని మండలంలోని మిగతా సర్పంచులు కూడా పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.