మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

అటవీశాఖ ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ లో పర్యావరణ దినోత్సవం.

 అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం.

 - యువకులకు వాలీబాల్ కిట్ల పంపి ణి.

 పర్యావరణ దినోత్సవ సందర్భంగా లక్ష్యం పూర్ గిరిజన యువతకు వాలీబాల్ కిట్లు అందజేస్తున్న బెల్లంపల్లి ఎఫ్ఆర్ఓ సుభాష్.


Scv News Kasipet:--

 కాసిపేట మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈరోజు బెల్లంపల్లి రేంజి అటవీ అధికారుల ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ సుభాష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీని రక్షించాలని రాబోయే కాలంలో అటవీ అభివృద్ధి వల్లనే విపత్తుల నుండి మనుషులను కాపాడుకోవడం జరుగు తుందన్నారు.అటవీ తల్లి మనకు అన్ని ఇస్తున్నదని తిరిగి అడవిని కాపాడటమే మన కర్తవ్యం అని అన్నారు.ప్లాస్టిక్ నీ నిషేదించాలని, పర్యావరణ సమతుల్యత కోసం విరివిగా చెట్లు నాటాలని, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19 న హరితహరం కార్యక్రమము విజయవంతం చేయాలన్నారు. వణ్య ప్రాణులను,అడవులని కాపాడి పర్యావరణ సమతుల్యత కాపాడాలని కోరారు.అలాగే ఆదివాసీ బిడ్డలు అన్ని రంగాల్లో రాణించాలని,క్రీడలు మనిషికి మనసికొల్లసాన్నిస్తయని అన్నారు. ఈ కార్యక్రమంలో యువతకు వాలీ బాల్ కిట్లను అందజేశారు.యువత మంచి మార్గం లో నడవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం లో Dy R O ముత్యం పల్లి B.ప్రవీణ్ నాయక్, ఆదివాసీ నాయకులు ప్రభాకర్, మల్లేష్,భీమ్ రావు వాచెర్ లక్ష్మణ్ గ్రామస్థులు పాల్గొన్నారు.