రేణుక ఎల్లమ్మ బోనాలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహాయం.

రేణుక బోనాలకు సహాయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందించిన 10000 రూపాయలను ధర్మారావుపేట గౌడ సంఘం నాయకులకు అందజేస్తున్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి.
Scv News Kasipet:--
కాసిపేట మండలం ధర్మారావు పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పదివేల రూపాయలు సహాయాన్ని అందజేశారు. గౌడకులస్తుల ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను కలిసి సహాయం చేయాల్సిందిగా కోర గా బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి ద్వారా ఈరోజు పదివేల రూపాయల నగదును మండల గౌడ సంఘం నాయకులు నేరెళ్ల బుగ్గయ్య గౌడ్ పడాల మల్లేష్ గౌడ్ లకు అందజేశారు. రేణుక ఎల్లమ్మ బోనాలకు సహాయం చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అందుకు సహకరించిన మంజుల రెడ్డికి బిఆర్ఎస్ నాయకులకు ధర్మారావుపేట గౌడ సంఘం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట బారసా గ్రామ కమిటీ అధ్యక్షుడు బాణాల సత్యనారాయణ, టిఆర్ఎస్ నాయకులు అల్లముల చంద్రయ్య, బాస వేణి కొమురయ్య, గట్టయ్య లు వున్నారు.