మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటన పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన లు.

 కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటన.

పలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన లు.

 దేవాపూర్ పంచాయతీలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 సోనాపూర్ లో మన ఊరి మనబడి ప్రారంభోత్సవ  కార్యక్రమములో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.


Scv News Kasipet:--

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వారోత్సవాలను పురస్కరించు కుని కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా నూతన గ్రామపంచాయతీ భవనాలకు భూమి పూజలు  శంకుస్థాపన, మన ఊరి మనబడి పాఠశాల ప్రారంభో త్సవాలు, హరితహారం లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనాపూర్, గట్రావుపల్లి,మద్దిమడ నూతన గ్రామపంచాయతీ భవనాలకు భూమి పూజ చేశారు. మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి చేసిన సోనాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం చేశారు. దేవాపూర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ, హరితహారం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొ న్నారు. మద్దిమడ పంచాయతీలో నూతన పంచాయతీ భవనానికి భూమి పూజ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో  జడ్పీ వైస్ చైర్మన్ తుంగల సత్యనారాయణ, ఎంపీపీ రొడ్డలక్ష్మీ జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీడీవో అలీ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.