అడవి తల్లికి తొలి పూజ గిరిజన గ్రామాలలో ప్రారంభమైన ఆకడి సంబురం.
- అడవుల్లో వనభోజనాలు ఏత్మసర్ పేన్ కు పూజలు నాలుగు మాసాల వరకు కొనసాగింపు.
- కోడి పంచాంగం చూస్తున్నా ఆదివాసీలు.

కుర్రేఘాట్ గ్రామంలో ఆదివాసుల అకడి సంబరాల దృశ్యం.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని వివిధ ఆదివాసిగూడలో తొలి ఏకాదశి సందర్భంగా అకడి సంబరాలు, వనభోజనాలు జరుపుకున్నారు.మండలంలోని ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కాపాడటంలో ముందుంటారు. ఆదివాసీలు అషాడ మాసంలో ముందుగా వచ్చే పండుగ అకడి కుర్రెగడ్ గ్రామంలో అకడి పండుగ ప్రారంభించడం జరిగింది.అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వనంలో పూజాలు పోలిమేర లో వెళ్లి చెట్టు కింద ఉన్న రాజుల్ పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు కోడి పంచాంగం చూడటం గ్రామం లోని పాడి పంటలు పశువులు బాగుండాలి అని అకిపేన్ వద్ద భక్తులు పూజ దాని తర్వాతే ఆకులను తెంపడం జరుగుతుంది. ప్రత్యేకంగా లక్ష్మణా రేఖ లాంటి గీత గిసి తయారు చేసిన తూర్రను ఉదడంతో పశువులను గీత దాటించడం. బోజనాలు చేయడం జరుగుతుంది.ఆకడి అనంతం నాగుల పంచమి. జమురవుష్ శివబోడి పొలాల అమావాస్య బడిగా దసరా దీపావళి పండుగ చేయడం జరుగుతుంది. అని గ్రామ పటేల్ వల్క మోతిరం. శ్రీను కుర్సింగ భూదేశవ్ మదరవ్ లచ్చు ఈశ్రు గ్రామస్థులు పేర్కొన్నారు.