మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కొండాపూర్ చౌరస్తాలోని రహదారి పైన గుంతలను వెంటనే మరమ్మతులు చేయాలి.

 కొండాపూర్ చౌరస్తాలోని రహదారి పైన గుంతలను  పూడ్చి  వెంటనే మరమ్మతులు చేయాలి.

- బిజెపి మండల ఇన్చార్జి అట్కాపురం రమేష్ డిమాండ్.


 కొండాపూర్ చౌరస్తాలోని మండల ప్రధాన రహదారిపై పడ్డ గుంతలను పరిశీలిస్తున్న బిజెపి మండల ఇన్చార్జి అట్ కాపురం రమేష్.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో మండల గుంతల మాయమై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న అధికారులు మండల ప్రజాప్రతినిధులు పట్టించు కోకపోవడం దురదృష్ట కరమని మండల బిజెపి ఇన్చార్జి అట్కాపురం రమేష్ విమర్శించారు. ఈరోజు కొండాపూర్ చౌరస్తాలోని గుంతలను పరిశీలించాడు. ప్రధాన రహదారిపై గుంతలు పడకుండా చూసుకోవడం, గుంత లు పడిన వాటిని పూడ్చాల్సిన బాధ్యత ఉన్న సర్పంచి,పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు. వర్షపు నీరు కాలువల ద్వారా బయటికి వెళ్లాల్సి ఉండగా కొంతమంది డ్రైనేజీలను ఆక్రమించి మీరు వెళ్లకుండా చేయడంతో రహదారిపైనే నీరు నిలిచి గుంతలు పడుతున్నాయి అన్నారు. మండల ప్రధాన రహదారి గుంతలు పడి వాహనదారులు ప్రజలు అవస్థలు పడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.వెంటనే రోడ్లు భవనాల శాఖ, మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు స్పందించి గుంతలు మూసేందుకు కృషి చేయాలని లేకుంటే బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.