మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మావోయిస్టు నేత కామ్రేడ్ కటకం సుదర్శన్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ నివాళి.

 మావోయిస్టు నేత కామ్రేడ్ కటకం సుదర్శన్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ నివాళి.

 మావోయిస్టు నేత కామ్రేడ్ కటకం సుదర్శన్ కు నివాళులర్పిస్తున్న కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ.

Scv News Kasipet:--

మావోయిస్టు పార్టీ  పొలిట్ బ్యూరో సభ్యుడు,కామ్రేడ్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్  గత నెల మే 31 రోజున మృతి చెందగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ, సుదర్శన్  స్వగృహానికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళుల అర్పించారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో పుట్టిన సుదర్శన్  పట్టణంలో గుండాల పెత్తనం రాజరిక వ్యవస్థ ఎక్కువైపోతుందని వారికి ఎదురించి తిరుగుబాటు మొదలు పెట్టారని అలా మొదలైన వారి ప్రస్థానం  1977లో  లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల ఆర్గనైజర్ గా బాధ్యతలు తీసుకు న్నారన్నారు.  అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్య కమిటీ సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శిగా,కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారని,సుమారు 50 ఏళ్ల ఉద్యమ బాటలో ఇంటి ముఖం చూడని  సుదర్శన్  అడవిలోనే అంతం అవుతాను కానీ లొంగిపోవడం జరగదని తన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడిన గొప్ప మనిషి కామ్రేడ్ సుదర్శన్ అని కొనియాడారు .