మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట-2 ఇంక్లైన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం.

 కాసిపేట-2 ఇంక్లైన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం.


 కాసిపేట టూ ఇంక్లైన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది  దినోత్సవం లో పాల్గొన్న అధికారులు.

Scv News Kasipet:--

 మందమర్రి ఏరియా కాసిపేట టు ఇంక్లైన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్స వాలు ఈరోజు ఘనంగా నిర్వహిచారు. గని మేనేజర్ లక్ష్మీనారాయణ కార్మిక సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసిపేట్ గ్రూప్ ఏజెంట్ శ్రీ కుర్మా రాజేందర్ లు తెలంగాణ అమరవీరులకు పూలమాలలు సమర్పించారు. గని మేనేజర్ జాతీయ జెండాను ఎగురవే  సారు.

ఈ సందర్భంగా ఏజెంట్ కుర్మ రాజేందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత  తెలంగాణ ప్రభుత్వం మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గత దశాబ్దంలో సాధించిన విజయాలను కొనియాడారు.

కాలరీ మేనేజర్ లక్ష్మి నారాయణ  మాట్లాడుతూ ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రజా ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రంగా అవతరించినది అని ఆ పోరాటాలను గుర్తు చేయడం జరిగినది. కాసిపెట్-2 ఇంక్లైన్ మే నెలలో 100% ఉత్పత్తి సాధించినందుకు ఉద్యోగుల ను అభినందించారు, అలాగే మొదటి సారిగా కాసిపేట-2 ఇంక్లైన్  ఒక నెలలో 8000 టన్నుల ఉత్పత్తి మైలురాయి నీ దాటింది అని తెలియజేశాడు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచిన SDL ఆపరేటర్స్ కి భహుమతి ప్రధానం చేయడం జరిగినది,  యూనియన్ నాయకులు శ్రీ కారికురి తిరుపతి Tbgks pit secretary, sri గొల్ల శ్రీనివాస్ AITUC పిట్ సెక్రెటరీ, మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పడం, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు .

సంక్షేమ  అధికారి  కల్లేపెళ్లి భార్గవ్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసినందుకు భాగస్వాములు మరియు అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ కార్యక్రమం లో రక్షణాధికరి  సంతోష రావు, పిట్ ఇంజనీర్ బొడ్డిరెడ్డి రఘు, ఇతర అధికారులు యూనియన్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.