ఘనంగా కాసిపేట గని పై తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు.
![]() |
| తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఏజెంట్ కుర్మ రాజేందర్. |
ScvNews Kasipet:--
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఛైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఇచ్చిన పిలుపుమేరకు కాసిపేట గని పైన ఈరోజు దశాబ్ది ఉత్సవాలను కాసిపేట గ్రూపు ఏజెంట్ కుర్మ రాజేందర్,గని మేనేజర్ అల్లావుద్దీన్ ప్రారంభించారు.
కాసిపేట గని పై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మేనేజర్ అల్లావుద్దీన్, అనంతరం తెలంగాణ తల్లి,అంబేద్కర్, ప్రొపెసర్ జయశంకర్ ,అమరవీరుల స్థూప చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఆట -పాటలు,నృత్యాలు,బోనాలు,బతుకమ్మ,పోతారాజుల నృత్యాలు, తెలంగాణ తల్లి వేషధారణ అందరిని అక్షర్శించాయి. . AITUC బ్రాంచ్ సెక్రెటరీ దాగం మల్లేష్, ఫిట్ సెక్రెటరీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లోనేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. TBGKS ఏరియా కార్యదర్శి ఒడ్నాల రాజన్న మాట్లాడుతూ మలిదశ ఉద్యమం సింగరేణి లో పోరాటాన్ని ఉదృతం చేసి జైలు కెళ్లామని ఆనాటి పోరాట ఫలితాల వల్ల మనము అందరం ఆనందంగా ఉన్నామని అన్నారు. రక్షణ అధికారి సునీల్ కుమార్, అధికారుల సంఘం సెక్రెటరీ బాబు,మధుకర్ మాట్లాడారు .
ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ బన్న లక్ష్మన్ దాస్, TBGKS, ఏఐటీయూసీ నాయకులు సోల్లంకి శ్రీనివాస్, అబ్దుల్,తోకల రమేష్, దొమ్మతి రమేష్ మైఖేల్,బండారు రమేష్, వెంకట రాజం, రాజేందర్, రవి,SC, ST అసోషియేషన్ నాయకులు కృష్ణ, కనుకుల తిరుపతి, దరవత్ తిరుపతి,INTUC నాయకులు రవీందర్,అన్ని యూనియన్ల ప్రతినిధులు,అధికారులు నిఖిల్, వెంకటేష్,సుమన్,వంశీకృష్ణ, దిలీప్,ఖాన్,సంక్షేమ అధికారి మీర్జా జీసాన్, మహిళ ఉద్యోగులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

