కాసిపేట గని పై ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ధశాబ్ది ఉత్సవాలు.
![]() |
| కాసిపేట గని పై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు. |
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట ఆవరణలో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్స వాలు ఘనంగా జరిగాయి.గని మేనేజర్ అల్లావుద్దీన్ తెలంగాణ తల్లి,అంబేద్కర్, ప్రొపెసర్ జయశంకర్ సార్,అమరవీరుల స్థూప చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం కార్మిక సంఘ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ పాటల కనుగుణంగా కార్మికులు అధికారులు ఆట -పాటలు,నృత్యాలు అందరిని అక్షర్శించాయి. అనంతరం గని మేనేజర్ అల్లావుద్దీన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రపంచ దేశాలలో కూడా మారుమోగిందని అందరి నోటా ఒక్కటే నినాదం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని అన్నారు. ఆనాడు పాలకుల వివక్షత వల్ల రాష్ట్రం వెనుకబడి నీళ్లు,నిధులు, నియమకాలు లేకుండా చేయడం,యాస,భాషలను ఎగతాళి చేయడం ప్రజాలకు సరైన పాలన ను అందించక పోవడం వల్ల తొలి దశ ఉద్యమం మొదలైందన్నారు. మాతండ్రి గారు తొలిదశ పోరాటంలో ఇల్లందు లో పాల్గొన్నారని నేను మలిదశ ఉద్యమం లో భాగస్వామ్యం అయ్యానని అన్నారు. మలిదశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి చక్కని అభివృద్ధి లో పయనిస్తూ,సింగరేణి సంస్థ కు గుర్తింపు అంతర్జాతీయ స్థాయిలో ఉందని,బొగ్గు ఉత్పత్తి చేయడం వల్ల తెలంగాన కు మనవంతు బాధ్యతలు నెరవేర్చిన వరమావూతామని అన్నారు.
AITUC ఫిట్ సెక్రెటరీ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లోనేను కూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. TBGKS ఏరియా కార్యదర్శి ఒడ్నాల రాజన్న మాట్లాడుతూ మలిదశ ఉద్యమం సింగరేణి లో పోరాటాన్ని ఉదృతం చేసి జైలు కెళ్లామని ఆనాటి పోరాట ఫలితాల వల్ల మనము అందరం ఆనందంగా ఉన్నామని అన్నారు. రక్షణ అధికారి సునీల్ కుమార్, అధికారుల సంఘం సెక్రెటరీ బాబు గార్లు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ బన్న లక్ష్మన్ దాస్, TBGKS, ఏఐటీయూసీ నాయకులు సోల్లంకి శ్రీనివాస్, అబ్దుల్,తోకల రమేష్, దొమ్మతి రమేష్ మైఖేల్,బండారు రమేష్, వెంకట రాజం,రాజేందర్, రవి,SC, ST అసోషియేషన్ నాయకులు కృష్ణ, కనుకుల తిరుపతి, దరవత్ తిరుపతి,INTUC నాయకులు రవీందర్,అన్ని యూనియన్ల ప్రతినిధులు,అధికారులు నిఖిల్, వెంకటేష్, దిలీప్,ఖాన్,సంక్షేమ అధికారి మీర్జా జీసాన్, మహిళ ఉద్యోగులు,ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

