కాసిపేటగని ఉద్యోగికి పదవి విరమణ సందర్భంగా సన్మానం.

ఉద్యోగ విరమణ పొందుతున్న సత్యానందం కార్మికుడికి కంపెనీ బహుమతిని అందజేస్తున్న ఏజెంట్ రాజేందర్, మేనేజర్ అల్లావుద్దీన్ తదితరులు.
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట గని లో సాండ్ మీక్షింగ్ కోన్ ఆపరేటర్ గా పని చేస్తున్న బొంతు సత్యానందం పదవి విరమణ సందర్భంగా ఈరోజు కాసిపేట గ్రూప్ ఏజెంట్ రాజేందర్ ,మేనేజర్ అల్లావుద్దీన్ గుర్తింపు సంఘాల నాయకులు సన్మానించారు.
అనంతరం సత్యానందమును ఉద్దేశించి మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ నిబద్ధత కల్గిన వ్యక్తి అని,సరైన పద్దతులలో పనిచేయ గలవారని అన్నారు. కంపెనీలో పని పట్ల విశ్వాసం గల సీనియర్ కార్మికులు ఉద్యోగ విరమణ పొందడం కంపెనీకి ఎంతో నష్టమని అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతున్న సత్యానందం ను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు చిప్ప నర్సయ్య,దాగం మల్లేష్,మీనుగు లక్ష్మీ నారాయణ, రాజేందర్(AITUC) ఒడ్నా ల రాజన్న,బన్న లక్ష్మన్ దాస్,మేడ సమ్మయ్య,అబ్దుల్,శ్రీనివాస్,అశోక్, రమేష్ లు శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో SO సునీల్ కుమార్,ఇంజనీర్లు బాబు,మధుకర్,అండర్ మేనేజర్ నిఖిల్,వెంకటేష్, సుమన్, దిలీప్,సిద్దార్థ, సర్వేయర్, వెంకటేశ్వర్లు, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషా పాల్గొన్నారు.