కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. |
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కల నిరవేర్చిన సోనియా గాంధీ గారికి మనందరం జీవితాంతం ఋణ పడి ఉండాలన్నారు. పదేళ్ల క్రితం సబ్బండ వర్గాల పోరాటం వల్ల తెచ్చుకున్న తెలంగాణ ను నేడు కెసిఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ అధోగతి పాల అయిందన్నరు. రాష్ట్రంలో రాజరిక వ్యవస్థ కీచక పాలన సాగుతుందన్నారు. మిగులు బడ్జెట్ తో తెచ్చుకున్న తెలంగాణ అప్పుల తెలంగాణ ను చేసారని ఇలాంటి రాచరిక పాలనను పారద్రోలి స్వతంత్ర తెలంగాణను తెచ్చుకోవడానికి మనమందరం ఇంకో ఉద్యమo చేయాల్సిన అవసరముందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపిటిసి లు పార్వతి మల్లేష్, భీమ్ రావ్,మెరుగు శంకర్ లు,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,ఎస్ సి సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, మహిళ నాయకురాలు పార్వతి భాయి,ఆటో యూనియన్ అధ్యక్షులు దూడ మహేష్, నాయకులు మైధం రమేష్, కాపురపు శ్రీను,పంబల తిరుపతి,కొత్త రమేష్,బన్న శ్రీను, భిక్షపతి,అచుత్ రావు,వేంకటేష్, ప్రేమ్,మడవి వెంకటేష్,పుర్ర పొషం, నలిగేటి శంకర్,ప్రభాత్ రావు, సమీర్, అనంత రావు,వేల్పుల కిరణ్, జంపయ్య,మహంకాళి,కలీమ్ తదితరులు పాల్గొన్నారు
