పెద్దనపల్లి సర్పంచ్ కళ్యాణ కానుక అందజేత . 
సర్పంచి వేముల కృష్ణ కళ్యాణ కానుకను అందజేస్తున్న దృశ్యం
Scv News Kasipet:-- కాసిపేటమండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపు గూడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పల్లె ఎల్లయ్య -బుచ్చక్క ఏకైక కుమార్తె శిరీష వివాహ ఉండగా సర్పంచ్ కళ్యాణ కానుక 5016 రూపాయలు చీరె సారే సర్పంచ్ వేముల కృష్ణ -వకుళాదేవి దంపతులు అందజేసారు. నిరుపేద కుటుంబానికి సహాయం చేసిన సర్పంచ్ దంపతులను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచిన నాటి నుండి గ్రామంలో నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహం చేయాలంటే చాలా ఆర్థికంగా నాన ఇబ్బందులకు గురవుతున్నారు దీనిని దృష్టిలో పెట్టుకొని నా వంతుగా ఆ కుటుంబానికి ఆర్ధిక చేయూత ఉండాలని స్వంత డబ్బులతో చేయడమే కాకుండా గ్రామంలో వివిధ రకాలుగా నా సేవ కార్యక్రమాలు ఉంటున్నాయి నిత్యం ప్రజల మధ్యే ఉంటు పెద ప్రజలకు అండగా ఉండడం జరిగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోముని మైసక్క, వార్డు సభ్యులు కొత్త రమేష్,,జయ, గ్రామ పెద్దలు కూకట్ల దేవెందర్, సోమని రాజం,లగుడం శ్రీనివాస్, రాజు, నవీన్, మల్లేష్ సూది తదితరులు పాల్గొన్నారు.
