పేదింటి పెళ్లికి పెద్దనపల్లి సర్పంచ్ కళ్యాణ కానుక సహాయం.

జీదుల రామన్న కూతురు సాహిత్య వివాహా నికి కళ్యాణ కానుక కింద ఆర్థిక సాయం అందిస్తున్న పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ దంపతులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీ కీ చెందిన జీదుల రామన్న -లత ల పెద్ద కూతురు సాహిత్య వివాహం 10 వ తేదీన ఉండగా స్వంత ఖర్చులతో నిర్వహించే సర్పంచ్ వేముల కృష్ణ- వకళాదేవి దంపతులు కళ్యాణ కానుక కొనసాగింపుగా ఈరోజు 5,016 రూపాయలు చీరె సారే ను ఇంటికి వెళ్లి అందచేసారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేర కు పంచాయతీ పరిధిలోని నిరుపేదల ఆడపిల్లల పెళ్ళికి సర్పంచ్ వేముల కృష్ణ కళ్యాణి కానుక ద్వారా ఆర్థిక సాహయం చేసి ఆదుకుంటు న్నారు. మండలంలోని ప్రతి సర్పంచ్ కూడా పెద్దన్న పోలీస్ సర్పంచ్ వేముల కృష్ణను ఆదర్శంగా తీసుకొని పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం చేసి ఆదర్శంగా నిలవాలని మండల వాసులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కంచర్ల పద్మ, బొల్లపెల్లి కొమురక్క, బన్న హిందుమతి, కాంగ్రెస్ నాయకులు దూడం మహేష్ అన్నం కుమార్,రవి , శ్రీధర్ లు పాల్గొన్నారు.