నీట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జీదుల సిరిని సన్మానించిన ప్రజా ప్రతినిధులు.
![]() |
| జీదుల సిరిని సన్మానిస్తున్న జడ్పిటిసి పల్లె చంద్రయ్య, ప్రజాప్రతినిధులు కొండ బత్తుల రామచందర్ సాపాట్ శంకర్ తదితరులు. |
కాసిపేట మండలం పెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనీకి చెందిన జీదుల లక్ష్మణ్ - రాధిక ల కూతురైన జీదుల సిరి నీట్ లో అత్యుత్తమ ప్రతిభ చూపి సీటు సంపాదించి నందుకు కాసిపేట మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, పెద్దనపల్లె ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్, సోమగూడెం కే సర్పంచ్ సపాట్ శంకర్ లు ఈరోజు వారి ఇంటికెళ్లి జీదుల సిరిని అభినందించి శాలువాతో సన్మానం చేశారు. జీదుల సిరి విద్యాభ్యాసం అంత కూడా ప్రభుత్వ బీసీ వేల్ఫర్ మరియు ఇంటర్ మడికొండ వరంగల్ సోషల్ వేల్ఫర్ COE లొ చదువుకొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలొ అత్యుతమ ప్రదర్శన కనబరిచి సీటు సంపాదించింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కుంట శేఖర్ ,పెద్దనపల్లి గ్రామ అధ్యక్షులు వెల్ది శ్రావణ్ కుమార్,సోమగూడెం కే గ్రామ అధ్యక్షులు బూడిద రమేష్ ,పెద్దనపల్లి యూత్ అధ్యక్షులు పులికొండ వంశీ, పార్టీ సీనియర్ నాయకులు జిదులా కనకయ్య, ఉప్పులేటి శ్రీనివాస్,ఉమ్మడి తిరుమల చారి,ఊరడీ శంకర్, తుడుం వెంకటమ్మ , టీవీ 5 రిపొర్టర్ కాల్వల అరుణ్ కుమార్, యూత్ బంధర్ వినయ్, హరీష్, కంచర్ల సాయి కుమార్, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

