మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మల్కేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జపాన్ దేశ ఆహ్వానం.

 మల్కేపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థికి జపాన్ దేశ ఆహ్వానం.   

 జపాన్  దేశానికి ఆహ్వానించబడ్డ విద్యార్థి జుమ్మడి అంజన్న తో గైడ్ టీచర్ వేములవాడ రమేష్.

 ఇన్స్పైర్ మేళాలో జాతీయ బహుమతి పొందిన అంజన్న .

Scv News Kasipet:--

 కాసిపేట మండలం మల్కపల్లి ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల  నుండి గతంలో ఫీడింగ్ ఛాంబర్ ప్రాజెక్ట్  ను భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు వేములవాడ రమేశ్  తన విద్యార్థి జుముడిఅంజన్న  తో కలిసి రూపొందించి , ఆ ప్రాజెక్ట్  ద్వారా జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ లో 4వ స్థానం పొందారు. అలా తనకంటూ ఒక ప్రత్యేకతను పొందిన పాఠశాల   ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల మల్కేపల్లికి  మళ్ళీ అదే సైన్స్ ప్రాజెక్ట్ కు అరుదైన గౌరవం లభించింది. , గవర్నమెంట్ ఆఫ్ జపాన్ వారి నుండి సకుర సైన్స్ హై స్కూల్ ప్రోగ్రాం ఆఫ్ జపాన్ ద్వారా వారి దేశమును సందర్శించే అవకాశం కల్పించింది. జపాన్ దేశమును సందర్శించి అక్కడి నూతన సాంకేతికతను దగ్గరినుంచి తెలుసుకునే అవకాశం కల్పించింది. ఇంతటి గొప్ప అవకాశం లభించడం పట్ల గ్రామస్తులు, ఉపాద్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి జుమిడి.అంజన్న ను,  గైడ్ టీచర్ వేములవాడ. రమేశ్ సార్ ని, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు సార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇది మంచిర్యాల జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం గా కొనియాడారు. ఒక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని జపాన్  దేశ ప్రభుత్వం వారు అహ్వానిచడం పట్ల గిరిజన సంక్షేమశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ.అజ్మీరా.నరసింహ  మాట్లాడుతూ తొలిసారి ఈ అరుదైన గౌరవం  మల్లేపల్లి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల కి లభించినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.