దేవాపూర్ లో గాలి వానకు దెబ్బతిన్న ఆదివాసుల ఇల్లు.

అచ్యుతరావు గూడెంలో దెబ్బతిన్న ఆదివాసుల ఇల్లను పరిశీలిస్తున్న తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు. 
అచ్యుతరావు గూడెంలో గాలివానకు దెబ్బతిన్న ఆదివాసుల ఇండ్లు.
Scv News Kadipet:--
కాసిపేట మండలం దేవపూర్ పంచాయతీ పరిధిలో అచ్యుతరావు గూడెంలో బుధవారం సాయంత్రం పెద్దగూడెంలో గాలి వానకు ఆదివాసుల ఇల్లు దెబ్బతిన్నాయి. ఒక ఎడ్ల కొట్టం,నాలుగు ఇంటి పందిరి రేకులు గాలికి కొట్టుక పోయాయి. కొట్నాక సింధూజ , కనక జలపతి, మడావి దశరథ్ మడవి ఏసు భాయ్ ల ఇల్లు దెబ్బతిన్నాయి. గాలివానకు దెబ్బతిన్న ఆదివాసుల ఇళ్లను తుడుం దెబ్బ కాసిపేట మండల అధ్యక్షులు ఆత్రం జంగు సందర్శించి వారిని పరామర్శించారు. దెబ్బ తిన్న ఇళ్ల సమాచారాన్ని వెంటనే కాసిపేట MRO దిలీప్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈరోజు వీఆర్ఏ రవి వచ్చి కూలిపోయిన ఎడ్ల కొట్టము, ఇంటి పందిరి రేకులను పరిశీలించడం జరిగింది. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం వచ్చేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.