మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బదిలీ పై వెళుతున్న ఏజెంట్ రాజేందర్ కు కాసిపేట గనిపైన సన్మానం.

 బదిలీ పై వెళుతున్న ఏజెంట్ రాజేందర్ కు కాసిపేట గనిపైన  సన్మానం.

 కాసిపేట గని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న  బదిలీపై వెళ్తున్న ఏజెంట్ కుర్మా రాజేందర్.




 బదిలీపై వెళ్తున్న ఏజెంట్ కుర్మ రాజేందర్ ను సన్మానిస్తున్న యూనియన్ నాయకులు, కార్మికులు.

Scv News Kasipet:--

మందమర్రి ఏరియా కాసిపేట  గ్రూపు ఎజెంట్ గా నియమితులై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని బదిలీ పై RG3,OC 2 కు ప్రాజెక్టు అధికారిగా వెళుతున్న సందర్భంగా ఈరోజు  కాసిపేట 1 గనిపైన  ఉద్యోగులు, యూనియన్ నాయకులు, అధికారులు ఘనం గా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు చిప్ప నర్సయ్య, దాగం మల్లేష్ లు మాట్లాడుతూ అందరిని సమన్వయ పరిచి,అందరితో కలివిడిగా ఉండి పనులు వేగవంతంగా చేశారని అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఏరియా కార్యదర్శిమెడిపెల్లి సంపత్, బడికెల సంపత్,ఒడ్నాల రాజన్న లు మాట్లాడుతూ పారిశ్రామిక సంబంధాలు నెరపడంలో రాజేందర్ గారు దిట్ట అని అన్నారు. ఎజెంట్ గా ఉన్నన్ని రోజులు అనేక సమస్యలు పరిష్కారం చేశారని అన్నారు. కాసిపేట గని  మేనేజర్ అల్లావుద్దీన్  మాట్లాడుతూ గని అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేసి అధిక ఉత్పత్తి వచ్చే విదంగా చూశారని అన్నారు. బదిలీ పై వెళుతున్న సోమగూడెం గ్రూప్ ఏజెంట్  కుర్మ రాజేందర్ మాట్లాడుతూ ఏజెంట్ గా నాకు మంచి గుర్తింపు ఇచ్చిందని,మంచి పనులు చేసే అవకాశం,అందరికి అందుబాటులో ఉంది పనిచేసే లాగా చేసిందని,ఇక్కడి ఉద్యోగుల ను ఎప్పటికి మరవలెనని అన్నారు. సమావేశానికి ముందు

 గని మేనేజర్,అధికారులు ఏజెంట్ కుర్మ రాజేందర్ గారిని పూల బొకే,శాలువా తో సన్మానించారు. ఏఐటీయూసీ నాయకులు సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య,బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్,పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, రాజేందర్ సన్మానించారు.TBGKS ఏరియా వైస్ ప్రెసిడెంట్ మెడిపెల్లి సంపత్, కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్, కేంద్ర కమిటీ కార్యదర్శి O. రాజశేఖర్ గారుసాలువా,బోకే ప్రత్యేకం గా సన్మానించారు,అలాగే కాసిపేట గని TBGKS నాయకులు ఏరియా కార్యదర్శులు ఒడ్నాల రాజన్న, మేడ సమ్మయ్య, బన్న లక్ష్మన్ దాస్,అబ్దుల్,శ్రీనివాస్,అశోక్, రమేష్ లు శాలువా,పూలమాల, ఆత్మీయసన్మాన పత్రాన్ని  అందచేశారు.అనంతరం జూనియర్ అసిస్టెంట్ బన్న లక్ష్మన్ దాస్,ఆఫీస్ అటెండర్ మసాడి వెంకట రమణ  గజమాల, మెమెంటో తో సన్మానించారు. అలాగే SC/ST అసోషియేషన్ జనరల్ సెక్రెటరీ కనుకుల తిరుపతి,కృష్ణ,కుమార్ లు,కాసిపేట ప్రెస్ క్లబ్ నాయకులు రవిరాజ్,నజీర్,కూకట్ల రాజేష్, లింగ స్వామి,గని ఉద్యోగులు, డిపార్ట్మెంట్ ఓవర్ మెన్,సర్దార్, షాట్ ఫైరర్,ఆఫీసు సిబ్బంది,PO జనార్దన్ రెడ్డి,సర్వే సిబ్బంది,కోల్ కట్టర్,సపోర్ట్ మెన్,ప్యాన్ ఆపరేటర్లు, టెండల్, ఇంజనీరింగ్ సిబ్బంది,ఫిట్టర్, ఎలక్ట్రికల్, వివిధ ఉద్యోగులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో SO సునీల్ కుమార్, ఇంజనీర్లు బాబు, మధుకర్,అండర్ మేనేజర్ నిఖిల్,వెంకటేష్, సుమన్, దిలీప్,సిద్దార్థ, సర్వేయర్ వెంకటేశ్వర్లు, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషా పాల్గొన్నారు.