ముంపుబాధిత గ్రామం దుబ్బగూడెం వాసులకు పునరావాసం కలిపించాలని గ్రామస్తుల వేడుకోలు .

ఆర్ అండ్ ఆర్ కాలనీ స్థలం లో మాట్లాడుతున్న దుబ్బగూడం గ్రామస్తులు.
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కే కే ఓ సి ముంపు గ్రామమైన కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామ వాసులకు వెంటనే పునరావాసం కల్పించాలని గ్రామ ప్రజలు కోరు తున్నారు. సింగరేణి యాజమాన్యం రెవెన్యూ అధికారులు కేటాయించిన R&R కాలనీ పునరావాసం స్థలం లో సంవత్సరం గడుస్తున్న ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గత వర్షకాలంలో కావలసిన పనులు మళ్ళీ వర్షాకాలం సమీపిస్తున్నా పూర్తి కాలేదని వాపోతున్నారు. సింగరేణి యాజమాన్యం GM గారు RDO గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఈ విషయమై మంత్రిగారికి, కలెక్టర్ గారికి విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. RDO 18సం యువకుల ప్యాకేజీ వివరాలు వెల్లడించడం లేదు. కిందటి సంవత్సరం కురిసిన వర్షాలకు OC బ్లాస్టింగ్ తీవ్రతకు 20కి పైగా ఇల్లు కూలిపోవడం జరిగింది. మళ్ళీ వర్షాకాలం సంబవిస్తున్న క్రమంలో ఈసారి ఎన్ని ఇల్లు కూలిపోతాయో ఎవరికీ ప్రాణానష్టం జరుగుతుందో తెలియక జనాలు భయందోళన చెండుతున్నారు. కాబట్టి మాకు వెంటనే పునరావాసం కల్పించా లని లేనియెడల OC ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నా రు. కిందటిసారి పోలీస్ అధికారులు, సింగరేణి యాజమాన్యం కొన్ని రోజులు వేచిచుడమని చెప్పడం జరిగింది అందుకు గాను మేము oc ముట్టడిని విరామించకోవడం జరిగింది. ఇప్పడికి నెలలు గడుస్తున్నాయి అధికారుల నుండి ఇలాంటి సమాధానం లేకపోగా పునరావాసం అభివృద్ధి పనులు చేయడం లేదు. కావున RDO గారు GM గారు వెంటనే స్పందించి పనులు వెంగవంతం చేయించాలని మరియు 18 సం|| నిండిన యువకుల ప్యాకెజి వివరాలు వెల్లడించాలని కోరుతున్నాము. కార్యక్రమంలో ఓరం కవిరాజ్, బేంబడి మహేష్ సురేష్ ప్రసన్న రమేష్ తదితరులు పాల్గో న్నారు.