ధర్మారావు పేట లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు.
- ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూజలు.
![]() |
| ధర్మారావు పేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలకు హాజరైన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంపీపీ రోడ్డు లక్ష్మి |
Scv News Kasipet:--
కాసిపేట మండలం ధర్మారావు పేట గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ నిర్వహించారు. గత రెండు రోజులుగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం గౌడ కుటుంబాలన్నీ బోనాలతో రేణుక దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణం చేశారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక పూజలు.
ధర్మ రావు పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు. రేణుక ఎల్లమ్మకు మొక్కులు చెల్లించి పూజారులతో దీవెనలు తీసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రోడ్డ లక్ష్మి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి స్థానిక నాయకులు బాణాలు సత్యనారాయణ అల్లంల చంద్రయ్య, బాస వేణి కొమురయ్యలు ఉన్నారు.

