మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్, వర్ధంతి.

 దేవాపూర్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య  జయశంకర్ సార్, వర్ధంతి.


 ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్న నాయక్ పోడ్ సేవ  సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీ పరిధిలోని నాయక గుడెం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్త పెళ్లి జయశంకర్ సార్ 12వ వర్ధంతి కార్యక్రమం నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి నాయక్ పోడు  సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, పాఠశాల ఉపాధ్యాయురాలు నవీన, కొమ్ముల సంజీవ్, మేకల సునీల్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొమ్ముల బాపు మాట్లాడుతూ  ఆంధ్ర వలస పాలన నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధించేందుకు జయశంకర్ సార్ తన జీవితాన్ని త్యాగం చేశాడని, తెలంగాణ కోసం బ్రహ్మచారిగా మిగిలి అందరిని ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాడని అన్నారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ జయశంకర్ సార్ ను గుర్తు చేసుకోవాలని కోరారు.