చిన్న ధర్మారం మైనారిటీ వాడలో తాగునీటి కష్టాలు.
తాగునీటి సమస్య తీర్చాలని బిజెపి నాయకుల డిమాండ్.

చిన్న ధర్మారం మైనారిటీ వాడలో తాగునీటి సమస్యపై మాట్లాడుతున్న బిజెపి మండల కార్యదర్శి సూరం సంపత్ కుమార్. 
విద్యుత్ కనెక్షన్ ఇవ్వని బోర్వెల్ ని చూపెడుతున్న గ్రామస్తులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం గ్రామంలో ముస్లిం మైనార్టీ వాడలోని ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తాగునీరు అందించే బోర్వెల్ చెడిపోయి మరమ్మతులు చేయక పోవడంతో గత కొద్ది రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ వాడలో కొన్ని నెలల క్రితం బోర్వెల్ వేయడం జరిగింది.ఆ బోర్వెల్ కి విద్యుత్ కలెక్షన్ ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి అవస్థలు తెలుసుకునేందుకు బిజెపి మండల కార్యదర్శి సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు మైనార్టీ వాడను ఈరోజు సందర్శి చారు. ముస్లిం మైనార్టీ వాడలో కనీస రోడ్ సౌకర్యం లేక 108 కానీ ఆటో వెళ్లలేని దుస్థితి నెలకొందని ఈ చిన్న ధర్మారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఇక్కడ ఉన్న ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ బుఖ్య సునీత కు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని సంపత్ ఆరోపించారు. గ్రామసభల్లో చెప్పిన అభివృద్ధి అనేది కనిపించడం లేదని గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డ్ నెంబర్లకు ఆ గ్రామపంచాయతీలో కనీస విలువ ఇవ్వడం లేదని విమర్శించారు. ముస్లిం వాడలో ఉన్న మహిళలు సమస్యలు తక్షణమే తీర్చకపోతే నీళ్ల బిందెలతో గ్రామపంచాయతీ ముట్టడిస్తామని బిజెపి నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు భాకి నరేష్, పులవేణి పోశం, గ్రామ వార్డు సభ్యులు సల్మా, గ్రామ మహిళలు సైనా సల్మా షరీఫా, సఫియా బి, జాన్ బి,ఆసియా అనిషా,రజియా రెహనా అనిషా గ్రామస్తులు మహిళలు తదితరు పాల్గొన్నారు.