కాసిపేట మండల బీజేవైఎం అధ్యక్షునిగా నగరపు ప్రసన్న.

కాసిపేట మండల బీజేవైఎం అధ్యక్షునిగా ఎంపికైన నగరారపు ప్రసన్నకు నియామాక పత్రం అందజేస్తున్న జిల్లా నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండల బీజేవైఎం అధ్యక్షునిగా నగరపు ప్రసన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు మంచిర్యాల బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలోనిర్వహించిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ గారు బీజేవైఎం మండల అధ్యక్షులుగా నగరపు ప్రసన్న ను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, బిజెపి బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, కాసిపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్, మండల నాయకులు పాల్గొన్నారు.