కాసిపేట మండలంలో భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

భట్టి విక్రమార్క జన్మదినోత్సవ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కి కేక్ తినిపిస్తున్నా సిద్ధం తిరుపతి.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సి యల్ పి లీడర్ భట్టి విక్రమార్క 62 వ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్ పంచిపెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం నుద్దేశించి వేముల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సి యల్ పి లీడర్ భట్టి విక్రమార్క గారి 62 వ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఇంత వయసులో కూడా తన ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తు, అవినీతి, అరాచక, పాలనను కొనసాగిస్తున్నా ఈ తరుణంలో సబ్బండ వర్గాల పోరాటాలు, విద్యార్థి యువత బలిదానాలకు చలించి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణ లో ఏం జరుగుతుందో చూసి ప్రజల మధ్యే తేల్చుకుందాం అని పాదయాత్ర నిర్వహించడంజరుగుతుందన్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ప్రారంభించిన పాదయాత్ర 1000 కిలో మీటర్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్న పీపుల్స్ మార్చ్ విజయవంతం కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో రాక్షస పాలన పోవాలని భట్టి విక్రమార్క గారి ఆశయం నెరవేరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, వార్డు సభ్యులు కొత్త రమేష్, పంబాల తిరుపతి, నాయకులు మల్లెత్తుల రాజేశం, జంపన్న, చారి ,జాడి శివ, వెంకటేష్,ప్రేమ్ నవీన్,లు పాల్గొన్నారు.