మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కేటీఆర్ పర్యటన సందర్భంగా అక్రమంగా ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్.

 కేటీఆర్ పర్యటన సందర్భంగా అక్రమంగా ప్రజా సంఘాల నాయకుల అరెస్ట్.



 దేవాపూర్ పోలీసుల అదుపులో తుడుం దెబ్బ నాయకులు. 

 కాసిపేట పోలీసుల అదుపులో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సంకె రవి.


Scv News Kasipet:--

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రజా సంఘాలు వివిధ పార్టీల నాయకులు నిరసనలు తెలుపకుండా ముందు జాగ్రత్తగా కాసిపేట మండలంలోని నాయకులను ఆదివారం అర్ధరాత్రి నుండి  అరెస్టులు చేశారు. దేవాపూర్ లో  తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు మడావి వెంకటేష్, ఉపాధ్యక్షుడు కనకరాజు, మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు, బాలరాజు, బిజెపి మండల ఇన్చార్జ్  అట్ కాపురం  రమేష్, కాంగ్రెస్ నాయకులు అన్నం కుమార్ ను అర్ధరాత్రి అదుపులో తీసుకొని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధి  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవిని పోలీసుల అదుపులో తీసుకున్నారు. 

 ఆదివాసి సంఘాల నాయకులను వివిధ పార్టీల నాయకుల అక్రమ అరెస్టు అప్రాజ్యస్వామికమని, అక్రమ అరెస్టుల ద్వారా  ఉద్యమాలను ఆపలేరని ఆదివాసి నిరుద్యోగులకు,ఉద్యోగాలు వచ్చేవరకు పోరాటాలు కొనసాగిద్దాం అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని  కొమ్ముల బాపు, ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి తట్ర భీమ్రావు, రాష్ట్ర నాయకులు రెడ్డి లక్ష్మణ్ సాంస్కృతిక కార్యదర్శిలు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.