ప్రాణాంతక ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా అవగాహన సమావేశం.
- ముందస్తుగానే ప్రమాదాలను నివారించుకోవాలి.
- రీజినల్ సేఫ్టీ GM- జాన్ ఆనంద్.

కాసిపేట గనిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తరుణ్ కు బహుమతి అందజేస్తున్న సేఫ్టీ జి ఎం జాన్ ఆనంద్.
Scv News Kasipet :--
ప్రాణాంతక ప్రమాదాల నివారణ ప్రత్యేక అవగాహన అనే అంశం పై సింగరేణి వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు ముందస్తుగానే పసి గట్టి నివారించాలని రీజినల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ గారు కాసిపేట గని సమావేశంలో ఆన్నారు.గత 08 (2014)సంవత్సర కాలం నుండి పరిశీలిస్తే ప్రమాదాలు ఎక్కువగా జూన్ మాసంలోనే జరుగుతున్నాయని,వచ్చే జూన్ మాసంలో ప్రమాదాలు రాకుండా నివారించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకోవాలలని ఆదేశించడం జరిగింది. ప్రమాదాలు అనుకోకుండా సంభవించి నప్పుడు వాటిపై సమీక్ష చేసి నివారించేం దుకు తగిన చర్యలు తీసుకుంటూనే, అసలు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడమే ఉత్తమమని అన్నారు.రక్షణ తో ప్రమాదాలను నివారించి ఈ వార్షిక సంవత్సరం లో 75 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని అన్నారు. అంతకు ముందు కాసిపేట గ్రూపు ఏజెంట్ కుర్మ రాజేందర్ మాట్లాడుతూ గత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణ వార్షిక సమీక్షను తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి మీర్జా గౌస్,AITUC, TBGKS పిట్ సెక్రటరీ లు మీనుగు లక్ష్మీ నారాయణ. అబ్దుల్లా, రక్షణ అధికారి సునీల్,ఇంజనీర్లు బాబు, మధుకర్, డిప్యూటి మేనేజర్ వెంకటేష్,వర్క్ మెన్ ఇన్స్పె క్టర్లు శ్రీనివాస్,బాను,నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
