మల్కపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.
![]() |
| మల్కపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
![]() |
| వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన వరి ధాన్యం. |
Scv News Kasipet :--
కాసి పేట మండలం మలకపల్లి పంచాయతీ పరిధిలో ధర్మారావుపేట్ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. మండల కేంద్రంలోని వివిధ గ్రామాల రైతులు వేసవికాలంలో పండించిన వరి పంటను ఈ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గత వారం రోజు నుండి రైతులు వరి కోత పనులు ప్రారంభించి వరి పంటను కొనుగోలు కేంద్రానికి చేర్చారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ సహకార సంఘ అధికారులు రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. వడ్ల కొనుగోలు కేంద్రంలో వర్షం వస్తే వాటిపై కప్పే కవర్లు లేవ ని, వడ్లు నింపే గోనెసంచులు లేవని రైతులు ఫిర్యాదు చేశారు. ఒక వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్పలు పోసి రాత్రింబవళ్లు పశువుల బరినుండి కాపలా కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకారం సంఘం అధ్యక్షురాలు బడవత్ నీలా స్పందిస్తూ వడ్ల తేమ తగ్గితే వెంటనే కొనుగోలు కార్యక్రమం ప్రారంభిస్తామని అన్నారు. తాసిల్దార్ దిలీప్ కుమార్ గోనెసంచులతో పాటు మంచినీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏ డి ఏ సురేఖ, ఎంపీపీ రోడ్డు లక్ష్మి జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సహకార సంఘం ఉపాధ్యక్షుడు తాటిపాముల శంకరయ్య, గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ జనార్ధన్, ఎంపీటీసీ భీమ్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, మాజీ జెడ్పిటిసి రౌత్ సత్తయ్య, మండల వ్యవసాయ అధికారి వందన తదితరులు పాల్గొన్నారు.

