జెపిఎస్ లను పర్మినెంట్ చేసి కెసిఆర్ మాట నిలుపుకోవాలి. - కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ.
![]() |
| జెపీఎస్ లకు సంఘీభావం తెలుపుతున్న మండల కాంగ్రెస్ నాయకులు. |
Scv News Kasipet:--
ముఖ్యమంత్రి కెసిఆర్ పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగంలో తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీమేరకు పర్మినెంట్ చేయాలని కాసిపేట మండల పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ డిమాండ్ చేశారు.ఈరోజు కాసిపేట మండల కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యదర్శులను ఉద్దేశించి వేముల కృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడి పరీక్ష రాసి వచ్చిన వారిని ఆనాడు కే సి ఆర్ వీరికి మూడు సంవత్సరాల ప్రొహిబిషన్ సమయం పెట్టి ఆ తరువాత రెగులర్ చేస్తామని చెప్పి ఇంకా చేయకపోవడం చాలా భాధకరమన్నారు. పంచాయతీ ల అభివృద్ధి లో భాగంగా జూనియర్ కార్యదర్శులు పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రయాసలు పడుతూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జూనియర్ కార్యదర్శులు రెగులర్ చేయాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని,విధి నిర్వహణ లో భాగంగా పని ఒత్తిడి మరియు వివిధ కారణాల ద్వారా మరణించిన వారికి 50 లక్షల ఎక్సగ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. వారికి రెండు వేల ఆర్థిక సహాయం చేసి ఇక మీదట కూడా వారికి కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం లో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ధర్మారావుపేట ఎంపిటిసి పార్వతి మల్లేష్, సోమగుడెం(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు గోలేటి స్వామి,నాయకులు మైధం రమేష్,జాడి శివ,కొత్త రమేష్, ప్రేమ్ కుమార్, వెంకటేష్, ముస్తఫా, అరుట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

